MCA లో అడ్మిషన్ వచ్చింది కదా ఇక ఇప్పటి నుండి చదువు మీదనే ఫోకస్ చేసి ప్రతీ రోజు కాలేజీ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నా.

అనుకున్నట్లుగానే మొదటిరోజు కాలేజీ కి వెళ్ళాను. మళ్లీ పిడుగు లాంటి వార్త . లైబ్రరీ ఫీజు 4500 రూపాయలు కడితేనే కాలేజీ లోకి అనుమతి ఉంటుంది అని ప్రకటన. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే నాకు మళ్లీ డబ్బు పుట్టడం అనేది అసంభవం 4500 రూపాయలు అంటే చాలా చాలా ఎక్కువ.

ప్రిన్సిపాల్ ను రిక్వెస్ట్ చేశాను వచ్చే సంవత్సరం కడతాను అని. కానీ ఆయన వినలేదు. వెళ్లి సీనియర్ లెక్చరర్ (HoD) ను అడుగు. అతను అనుమతిస్తే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. సీనియర్ లెక్చరర్ ను కలిసి నా పరిస్తితి ని వివరించాను. కానీ లాభం లేదు. కనీసం నా సర్టిఫికేట్స్ అయినా ఇవ్వండి అని అడిగాను. నీకు సర్టిఫికెట్స్ ఇస్తే మరి వచ్చే 2 సంవత్సరాలు నీ సీటు ఖాళీ గా ఉంటుంది కాబట్టి ఆ 2 సంవత్సరాల ఫీజు కూడా చెల్లించి సర్టిఫికెట్స్ తీసుకెళ్ళు అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. వారం రోజులు గా వెళ్తూనే ఉన్నా. కానీ నన్నెవరూ పట్టించు కోవడం లేదు. ఓపిక నశించింది.

ఒకరోజు ఆవేశంతో కాలేజీకి వెళ్ళాను. ప్రిన్సిపాల్, మరియు సీనియర్ లెక్చరర్ కలిసి ఒకే రూమ్ లో మాట్లాడుతున్నారు. నేను వారిని బయటకు రమ్మన్నాను. " మీరిద్దరూ నా జీవితాన్ని నాశనం చేశారు. నేను కట్టిన 25 వేల రూపాయల ఫీజు వెనుక ఉన్న విషాద కధ మీకు తెలియదు." అని గట్టిగా అరిచాను. స్టూడెంట్స్ అందరూ బయటికి వచ్చి చూస్తున్నారు. అంతా సైలెన్స్. ఒరేయ్ మీరంతా ప్రతీసారి నన్ను హేళనగా చూస్తున్నారు. నన్ను కనీసం 6 నెలల పాటు అయినా కాలేజీ కి రానివ్వండి. నేనేంటో మీకు తెలుస్తుంది అని ఎదురుగా కనిపించిన ఇటుక రాయిని తీసుకుని కసిదీరా నేలకేసి కొట్టి బద్దలు చేశాను.

చివరిగా లైబ్రరీ ఫీజు కట్టనంత వరకు కాలేజీ కి రానివ్వం కానీ attendance వేస్తూ exams కు మాత్రం అనుమతి ఇస్తాం అని హామీ ఇచ్చారు.

జీవితంలో కాలేజీ కి వెళ్ళాలనే నా కోరిక తీరకుండానే అలా ముగిసింది.

చివరికి MCA కంప్లీట్ కానే లేదు. exams అనుకున్న టైమ్ కు పాస్ కాలేదు. చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఫైనల్ గా MCA నుండి డ్రాప్ అయ్యాను. నాకు సాప్ట్ వేర్ కంపెనీ లో జాబ్ కన్ ఫర్మ్ అయ్యాక, జాబ్ లో జాయిన్ అయ్యే ముందు అప్పు చేసి మిగిలిన రెండు సంవత్సరాల ఫీజు చెల్లించి నా సర్టిఫికెట్స్ (10th, ఇంటర్, డిగ్రీ) తీసుకుని సాప్ట్ వేర్ కంపెనీ లో జాయిన్ అయ్యాను.

Back